Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిల్క్ స్మిత ఆ మాటంది... అప్పటి నుంచి దూరమయ్యా!: డ్యాన్స్ మాస్టర్ శివశంకర్

  • ఓ ఇంటర్వ్యూలో స్మితతో విభేదాలపై స్పందించిన శివశంకర్
  • నాతో చేయనని తెగేసి చెప్పింది
  • 'భలేతమ్ముడు' కోసం స్మిత స్థానంలో జయమాలిని
  • అప్పటి నుంచే దూరమయ్యానన్న శివశంకర్
దక్షిణాది సినీ రంగంలో డ్యాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుతున్న శివశంకర్ మాస్టర్, తనకు, సిల్క్ స్మితకు మధ్య ఉన్న విభేదాల గురించి ఓ తాజా ఇంటర్వ్యూలో నోరు విప్పారు. ఒక్క సిల్క్ స్మిత విషయంలోనే తనకు గొడవైందని చెప్పుకొచ్చారు. అయితే, ఆమె చాలా అందమైన ఆర్టిస్టని, తనకు నచ్చిన వారిలో ఆమె కూడా ఉందని చెప్పారు. హిందీలో రేఖ, ఇక్కడ స్మిత డ్యాన్స్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.

తనకు ఆమెతో విభేదాలపై మాట్లాడుతూ, ఆమె ఫేమస్ అయిన తరువాత, సొంతంగా డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసుకుందని, ముఖ్యంగా పులిగిరి సరోజను ఆమె రిఫర్ చేస్తుండేదని, ఆమె డేట్స్ లభించక తమబోటి వారిని పెడితే, సరిగ్గా చేయకుండా నానాయాగీ చేసేదని చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ నటించిన 'భలే తమ్ముడు' చిత్రంలో సిల్క్ స్మితతో ఓ పాట అనుకున్నామని, అయితే, రిహార్సల్స్ ముగిసిన తరువాత ఆమె నాతో చేయనని చెప్పి అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేసిందని అన్నారు. అప్పటికే పాటకు మంచి స్టెప్స్ వచ్చాయని భావించిన నిర్మాత అర్జున్ రాజు కోరిక మేరకు తాము జయమాలినితో ఆ పాట చిత్రీకరించామని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తాను ఆవిడకు దూరమయ్యానని అన్నారు. లెజండరీ డ్యాన్స్ మాస్టర్ సలీం వద్ద తాను అసిస్టెంట్ గా ఉండటాన్ని స్మిత చూసిందని, తాను మాస్టర్ గా మారాక, ఇతని దగ్గర నేనెందుకు చేయాలన్న ఆలోచన ఆమె మనసులో ఉండి ఉండవచ్చని శివశంకర్ వ్యాఖ్యానించారు.
SivaShankar
Dance Master
Silk Smita

More Telugu News